Wednesday, November 20, 2024

Marriage Scam – 50 పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లి కొడుకు అరెస్ట్ …….

హర్యానా/న్యూఢిల్లీ: 50 మంది మహిళలను మోసం చేసి లక్షల రూపాయలు కట్నం కింద తీసుకుని మోసం చేసిన నిత్యపెళ్లికొడుకును పోలీసులు అరెస్ట్ చేశారు. పలువురు మహిళల ఫిర్యాదులతో హర్యానా పోలీసులు సీరియస్ విచారణ చేపట్టగా ఒడిశాలో తలదాచుకున్న తబేష్‌ కుమార్ ను గురుగ్రామ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశాలో డ్రగ్స్ రిహాబిలిటేషన్ సెంటర్‌లో కొంతకాలంగా తబేష్ కుమార్ చికిత్స పొందుతున్నాడని తెలుసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేసి అతని మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు.

వివ‌రాల‌లోకి వెళితే తబేష్ కుమార్ భట్టాచార్య అలియాస్ తబేష్ కుమార్ (55) అనే వ్యక్తి జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌కు చెందినవాడు. 1992లో పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాకు చెందిన అమ్మాయిని మొదటిసారి వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు, అయితే పెళ్లయిన ఎనిమిదేళ్లకే భార్య, కుమార్తెను విడిచిపెట్టిన తబేష్ కుమార్ అదృశ్యమైనాడు.
ఆ తర్వాత కర్ణాటకలోని బెంగళూరుకు వెళ్లిన తబేష్ కుమార్ స్మార్ట్ హైర్ సొల్యూషన్ పేరుతో ప్లేస్‌మెంట్ కంపెనీని ప్రారంభించాడు. అక్కడ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి చాలా మంది స్త్రీలు, పురుషులను మోసం చేశాడు. దీంతో ఎక్కువ కాలం మోసాలు చెయ్యలేకపోయిన తబేష్ కుమార్ తరువాత షాదీ మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ ద్వారా భారీ మోసాలకు పాల్పడ్డారు.

షాదీ మ్యాట్రీమోనీలో పరిచయం అయిన విడాకులు తీసుకున్న మహిళలు, భర్తను కోల్పోయిన మహిళలు, ఇప్పటికే పెళ్లయిన మహిళలను తబేష్ కుమార్ టార్గెట్ చేశాడు. ఇలా 20 ఏళ్లలో 50 మందికి పైగా మహిళలను మోసం చేసి తబేష్ కుమార్ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయ్యాక భాగస్వామితో శారీరకంగా ఎంజాయ్ చేసిన తరువాత డబ్బు, నగలు దోచుకుని పారిపోవడం తబేష్ కుమార్ అలవాటు ..

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం తబేష్ కుమార్ పశ్చిమ బెంగాల్, కర్ణాటక, మహారాష్ట్ర, మణిపూర్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఒడిశా, హైదరాబాద్ తో పాటు పలు రాష్ట్రాల్లో మహిళలను మోసం చేసి వారిని నిలువు దోపిడీ చేశాడని తెలిపారు. ఈ మహిళల్లో న్యాయవాదులు, వైద్యులు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, వ్యాపారవేత్తలు, విద్యావంతులైన మహిళలు ఉన్నారని ,అందరికి తబేష్ కుమార్ మోసం చేశాడని పోలీసుల అధికారులు వెల్లడించారు..

కొన్ని చోట్ల తబేష్ కుమార్ మీద గృహహింస, మోసం చేశాడని బాధిత మహిళలు ఫిర్యాదులు చెయ్యడంతో అతను జైలు పాలయ్యాడు. అయితే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తబేష్ కుమార్ యథావిధిగా మోసాలకు పాల్పడుతున్నాడని పోలీసు అధికారులు తెలిపారు. తబేష్ కుమార్ మీద అనేక మంది మహిళలు ఫిర్యాదు చెయ్యడంతో అతని కోసం పోలీసులకు గాలిస్తుంటే నిందితుడు తబేష్ కుమార్ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని పారిపోతున్నాడు. చిట్ట చివ‌ర‌కు ఒడిశాలో పోలీసులు అరెస్ట్ చేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement