ఇంకొన్నాళ్లు సింగిలేనని తెలిపాడు హీరో అఖిల్.. తన పెళ్లిపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. నా పెళ్లిపై రకరకాలుగా రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు అలాంటి ఆలోచన లేదు. ప్రస్తుతం పెళ్లి మాటలేదు. నా దృష్టిలో లవ్ అనేది స్పోర్ట్స్ లాంటిదే’అని చెప్పుకొచ్చారు. దీంతో అక్కినేని హీరో పెళ్లిపై వస్తున్న రూమర్లకు అడ్డుకట్ట పడింది. ఇక తనకు క్రికెట్ అంటే చాలా ఇష్టమని.. స్ట్రెస్ బస్టర్ అని కూడా చెప్పారు.
తనకు క్రికెట్ ఆడుకునేందుకు 15 మందితో కూడిన ఓ టీమ్ ఉందని చెప్పారు. చిన్నప్పటి నుంచి ఆ బ్యాచ్ అలాగే కొనసాగుతోందన్నారు.రెండు మూడు రోజులకోసారైనా తను క్రికెట్ ఆడుతానన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం తనకు ఇబ్బందికరంగా ఉంటుందన్నారు. పర్సనల్ పోస్టులు పెట్టడం షైగా ఉంటుందని తెలిపారు. అందుకే తన అభిమానులు అవుతూ ఉంటారన్నారు. కేవలం వృత్తిపరమైన పోస్టులు మాత్రమే పెడుతుంటానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అఖిల్ నటించిన ‘ఏజెంట్ చిత్రం రిలీజ్ కు సిద్ధం అవుతోంది.