Friday, November 22, 2024

Share market: లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. ఊగిస‌లాట‌లో ప్రారంభ‌మైనా పుంజుకున్నాయి

గత వారం భారీ నష్టాల నుంచి స్టాక్‌మార్కెట్లు సోమవారం నాడు కోలుకున్నాయి. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు ఉండటంతో ఉదయం మార్కెట్లు ఊగిసలాటలోనే ప్రారంభమయ్యూయి. ఆ తరువాత క్రమంగా మార్కెట్లు లాభాల్లోకి వచ్చాయి. కొనుగోళ్ల మద్దతుతో పాటు కీలక కంపెనీల షేర్లు రాణించడంతో చివరకు మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 300.44 పాయింట్లు లాభంతో 59141.23 వద్ద ముగిసింది. నిఫ్టీ 91.40 పాయింట్ల లాభంతో 17622.25 వద్ద ముగిసింది.
బంగారం 10 గ్రాముల ధర 181 రూపాయలు తగ్గి 49199 వద్ద ట్రేడయ్యింది. వెండి కిలో 3 రూపాయలు త గ్గి 56717 వద్ద ట్రేడయ్యింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 79.59 రూపాయిలుగా ఉంది.

లాభపడిన షేర్లు
ఎం అండ్‌ ఎం, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎస్‌బీఐ, హిందుస్థాన్‌ యూనిలీవర్‌, నెస్లే ఇండియా, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌డీఎఫ్‌సీ, అదానీ పోర్టులు, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ షేర్లు లాభపడ్డాయి.

నష్టపోయిన షేర్లు
కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, హిండాల్కో ఇండస్ట్రీస్‌, బీజీసీఎల్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ , ఏషియన్ పెయింట్స్‌, టాటా కన్జ్యూమర్‌, టాటా స్టీల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పోరేషన్‌, ఎన్‌టీపీసీ, ఎల్‌ అండ్‌ టీ షేర్లు నష్టపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement