వరసగా రెండు రోజుల లాభాల్లో ఉన్న సూచీలు బుధవారంనాడు భారీ నష్టాలు ఎదుర్కొన్నాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం నాడు లాభాల్లోనే ముగిసినప్పటికీ, ఆసియా- పసిఫిక్ మార్కెట్లు మాత్రం మిశ్రమంగా స్పందించాయి. జ పాన్ కరెన్సీ ఎన్ విలువ భారీగా పతనం కావడం, రష్యా చమురు దిగుమతులను ఐరోపా దేశాలు అడ్డుకుంటున్నాయన్న వార్తలు, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల మూలంగా దేశీయ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ముడి చమురు ధరలు 110 డాలర్లకు దిగి వచ్చాయి. అమ్మకాల ఒత్తిడి వల్లే బుధవారం మార్కెట్లు నష్టాలను ఎదుర్కొన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
సెన్సెక్స్ 709.54 పాయింట్ల నష్టంతో 51822.53 వద్ద ముగిసింది. నిఫ్టీ 225.50 పాయింట్ల నష్టపోయి 15413.30 ముగిసింది. బంగారం 111 రూపాయిలు పెరిగి 50871 వద్ద ట్రేడయింది. వెండి కిలో 694 రూపాయిలు తగ్గి 60577 గా ఉంది. డాలర్ మారకంతో రూపాయి మరింత బలహీనపడి 78.40 రూపాయిలుగా ఉంది.
నష్టపోయిన షేర్లు..
హిండాల్కో, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, విప్రో, ఓఎన్జీసి, రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా, ఎస్‌బీఐ లైఫ్, బజాజ్ ఫిన్‌సర్వ్ ఉన్నాయి.
లాభపడిన షేర్లు..
మారుతి సుజుకీ, టీసీఎస్, పవర్ గ్రిడ్, హీరో మోటార్స్, బీపీసిఎల్ ఉన్నాయి.
రూపాయి మరింత పతనం..
అంతర్జాతీయ ఇన్వెస్టర్లు బుధవారం నాడు కూడా భారీగా అమ్మకాలు జరపడంతో రూపాయి మరింత
బలహీనపడింది. డాలర్‌తో రూపాయి విలువ 27 పైసలు తగ్గి 78.40 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు కొంత మేర తగ్గడంతో రూపాయి మరింత దిగజారకుండా అడ్డుకుందని ట్రేడర్స్ అభిప్రాయపడ్డారు. విదేశీ ఇన్వెస్టర్లు సోమవారం 2,701.21 కోట్ల మేర పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. మంగళ, బుధవారాల్లో ఇది మరింత ఎక్కువగా ఉంది. ఫలితంగా మన దేశ మార్కెట్లు నష్టాలను ఎదుర్కొంటున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.