దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా ఐదవ రోజు కూడా నష్టాల్లో ముగిసాయి. అమెరికాలో పతనమైన బ్యాంకుల ప్రభావం భారత మార్కెట్‌పై స్పష్టంగా కనిపించింది. ఆర్థిక రంగ ఆందోళనల మధ్య బ్యాంకింగ్ స్టాక్స్ ఒత్తిడిలో కొనసాగుతుండటంతో మార్కెట్లు బుధవారం నష్టాలను కనిష్ట స్థాయికి దగ్గరగా ముగించాయి. ఆర్థిక డేటాపై దృష్టి సారించడంతో గ్లోబల్ మార్కెట్లు బలహీనంగా ఉన్నాయి.
ఈ సెషన్లలో సెన్స్‌క్స్ 2,792 పాయింట్లు, నిఫ్టీ 50,782 పాయింట్లకు పైగా నష్టపోవడంతో దేశీయ ఈక్వీటీలు వరుసగా 5 వ రోజుకు కూడా ప్రమాద సూచికను చూపాయి. బుధవారం సెన్సెక్స్ 344.29 పాయింట్లు లేదా 0.59 శాతం క్షీణించి 57,555.90 వద్ద ముగిసింది. నిఫ్టీ 71.15 పాయింట్ల లేదా 0.42 శాతం పతనమై 16,972.15 వద్ద ముగిసింది. రూపాయి మారకం విలువ 82.14 రూపాయిలుగా ఉంది.
లాభపడిని షేర్లు..
అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అదానీ విల్‌మర్, ఇండియన్ బ్యాంక్, దాల్మియా భరత్, ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్, టైటాన్ కంపెనీ, ఎల్ అండ్ టీ, పవర్ గ్రిడ్. అంబుజా సిమెంట్స్,
నష్టపోయిన షేర్లు..
భారతీ ఎయిర్‌టెల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఆఐఎల్, హెచ్‌యుఎల్, ఎస్‌బీఐ, నెస్లే ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ , టాటా మోటార్స్, బ్రిటానియా, యాక్సిస్ బ్యాంక్, విప్రో, ఎస్‌బీఐ లైఫ్, టాటా కన్సూమర్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, సన్ ఫార్మా, బజాజ్ ఆటో, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్, ఓఎన్‌జీసీ.