Saturday, November 23, 2024

లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. మరింత బలహీనపడిన రూపాయి

స్టాక్‌ మార్కెట్లు రెండో రోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలు, ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియం వంటి పాజిటివ్‌ అంశాలతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభపడ్డాయి. దేశీయంగా నిత్యావసర సరకులు రేట్లు తగ్గుతున్నట్లు వచ్చిన వార్తలు, క్రూడ్‌ ఆయిల్‌ రేట్లు తగ్గుదల, అమెరికా బాండ్ల రాబడులు ఆశించన మేర లేకపోవడం ఇలా ఇతర అంశాలు కూడా కలిసి రావడంతో సూచీలు లాభపడ్డాయి. ఉదయం స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. చివరకు సెన్సెక్స్‌ 462.26 పాయింట్ల లాభపడి 52,727.98 వద్ద ముగిసింది. నిఫ్టీ 142.60 పాయింట్ల లాభంతో 15699.25 వద్ద ముగిసింది. బంగారం 10 గ్రాముల ధర 24 రూపాయలు పెరిగి 50618 వద్ద ట్రేడ్‌ అయ్యింది.

వెండి కేజీ 246 రూపాయలు తగ్గి 59258 రూపాయలగా ఉంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 77.98 రూపాయిలుగా ఉంది. రూపాయి మరింత పతనం కాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆర్బీఐ తెలిపింది. శుక్రవారం నాడు ట్రేడింగ్‌లో ప్రధానంగా ఎం అండ్‌ ఎం, ఇండస్‌ల్యాండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ పైనాన్స్‌, హీరో మోటార్స్‌, హెచ్‌యుఎల్‌, ఐసిఐసిఐ బ్యాంక్‌, బ్రిటానియా, ఓఎన్‌జీసీ, శ్రీ సిమెంట్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఐచర్‌ మోటార్స్‌, టాటా కన్జ్యూమర్‌ ప్రొడక్ట్స్‌ , హిండాల్కో, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి. ఐటి షేర్లు నష్టాలను ఎదుర్కోన్నాయి. ముఖ్యంగా టెక్‌ మహింద్రా, ఇన్ఫోసిస్‌, హెచ్‌సిఎల్‌, టీసీఎస్‌ షేర్లు నష్టపోయాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement