Thursday, November 21, 2024

Followup: నష్టాల్లో ముగిసిన మార్కెట్లు.. వరస లాభాలకు బ్రేక్‌

స్టాక్‌మార్కెట్ల వరస లాభాలకు బుధవారం నాడు బ్రేక్‌ పడింది. ఉదయం నుంచే మార్కెట్లు నష్టాల్లో ట్రేడింగ్‌ ప్రారంభించాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 400 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఇండ్రాడే నష్టాల తరువాత కొనుగోళ్ల మద్దతు లభించడంతో కొంతమేర పుంజుకుంది. చివరలో మళ్లిd అమ్మకాలు పెరగడంతో చివరకు మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అమెరికా ఫెడరల్‌ బ్యాంక్‌ రేట్ల పెంపుపై నిర్ణయం ప్రకటించనుంది. ఈ నేపథ్యంలోనే ఇన్వెస్టర్లు అచితూచీ వ్యవహరించారు.

సెన్సెక్స్‌ 262.96 పాయింట్లు నష్టపోయి 59456.78 వద్ద ముగిసింది. నిఫ్టీ 97.90 పాయింట్లు నష్టపోయి 17718.35 వద్ద ముగిసింది. బంగారం 10 గ్రాముల ధర 279 రూపాయలు పెరిగి 49454 వద్ద ట్రేడయ్యింది. వెండి కిలో 778 రూపాయలు పెరిగి 57121 వద్ద ట్రేడయ్యింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 79.61 రూపాయిలుగా ఉంది.

లాభపడిన షేర్లు
హిందుస్థాన్‌ యూనిలీవర్‌, ఐటీసీ, బజాబ్‌ ఫైనాన్స్‌, టెక్‌ మహీంద్రా, ఎంఅండ్‌ ఎం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, నెస్లే ఇండియా, బ్రిటానియా ఇండస్ట్రీస్‌, అపోలో హాస్పటల్స్‌, కోల్‌ ఇండియా షేర్లు లాభపడ్డాయి.

నష్టపోయిన షేర్లు
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, యూపిఎల్‌, మారుతి సుజుకీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టైటాన్‌ కంపెనీ, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఎల్‌ అండ్‌ టీ, ఎన్‌టీపీసీ , డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ షేర్లు నష్టపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement