Thursday, November 21, 2024

Follow up | భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరసగా రెండో రోజూ నష్టాల్లోనే ముగిశాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు ఏ దశలోనూ కోలుకోలేదు. బ్యాంకింగ్‌, రియల్‌ ఎస్టేట్‌ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అంతర్జాతీయ అనేక ప్రతికూల అంశాలు ప్రభావం మన మార్కెట్లపై పడింది. ప్రముఖ కంపెనీల షేర్ల ధరలు పతనం కావడం కూడ సూచీల నష్టాలకు దారి తీసింది. సెన్సెక్స్‌ 671.15 పాయింట్ల నష్టంతో 59135.13 వద్ద ముగిసింది. నిఫ్టీ 176.70 పాయింట్ల నష్టంతో 17412.90 వద్ద ముగిసింది.

బంగారం 10 గ్రాముల ధర 127 రూపాయలు పెరిగి 55428 వద్ద ట్రేడయ్యింది. వెండి కిలో ధర 129 రూపాయల తగ్గి61855 వద్ద ట్రేడయ్యింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 82.02 రూపాయలుగా ఉంది.

- Advertisement -

లాభపడిన షేర్లు

టాటా మోటార్స్‌, ఎన్‌టీపీసీ, మారుతీ సుజుకీ, సన్‌ ఫార్మా, పవర్‌ గ్రిడ్‌ కార్పోరేషన్‌, టైటాన్‌ కంపెనీ, హిందూస్థాన్‌ యూనిలీవర్‌, ఐటీసీ, టెక్‌ మహీంద్రా, బజాజ్‌ ఆటో, అదానీ పోర్ట్‌ ్స, బీపీసీఎల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు లాభపడ్డాయి.

నష్టపోయిన షేర్లు

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎం అండ్‌ ఎం, ఐసీఐసీఐ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, విప్రో, టీసీఎస్‌, టాటా స్టీల్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, దివిస్‌ ల్యాబ్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హీరో మోటోకార్ప్‌, ఓఎన్‌జీసీ, ఆపోలో ఆస్పటల్స్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లు నష్టపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement