దేశీయ స్టాక్ మార్కెట్లు వరసగా నాలుగు రోజుల నష్టాలకు గురువారం నాడు బ్రేక్ పడింది. గుజరాత్ ఎన్నికల ఫలితాలు మార్కెట్లకు కలిసివచ్చాయి. ఉదయం సూచీలు ప్లాట్‌గా ప్రారంభమయ్యాయి. చివరకు లాభాల్లో ముగిశాయి.
సెన్సెక్స్ 160 పాయింట్ల లాభంతో 62570.68 వద్ద ముగిసింది. నిఫ్టీ 48.85 పాయింట్ల లాభంతో 18609.35 వద్ద ముగిసింది.
బంగారం 10 గ్రాముల ధర 143 రూపాయలు పెరిగి 54130 వద్ద ట్రేడయ్యింది. వెండి కిలో ధర 765 రూపాయలు పెరిగి 67032 వద్ద ట్రేడయ్యింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 82.30 రూపాయలుగా ఉంది.
లాభపడిన షేర్లు
యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎస్‌బీఐ, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎంఅండ్ ఎం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మారుతి సుజుకీ, ఆల్ట్రాటెక్ సమెంట్స్, అదానీ ఎంట్రర్‌ప్రైజెస్ షేర్లు లాభపడ్డాయి.
నష్టపోయిన షేర్లు
పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టీసీఎస్, ఎన్‌టీపీసీ, కొటక్ మహీంద్రా బ్యాంక్, విప్రో, బజాజ్ ఫైనాన్స్, నెస్లే ఇండియా, ఐటీసీ, టెక్ మహీంద్రా, టైటాన్ కంపెనీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్ టెల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్ షేర్లు నష్టపోయాయి.