Saturday, November 23, 2024

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు..

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. అనంతరం ఒడిదుడుకులకు లోనయ్యాయి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత మళ్లీ పుంజుకోలేదు. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 273 పాయింట్లు నష్టపోయి 52,578కి పడిపోయింది. నిఫ్టీ 78 పాయింట్లు కోల్పోయి 15,746 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్లలోని అమ్మకాల ఒత్తిడి దేశీయ సూచీలపై పడింది. దీంతో మెజారిటీ రంగాల షేర్లు నష్టాలు చవిచూశాయి. చివరకు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.48 వద్ద నిలిచింది.

బీఎస్‌ఈ 30 సూచీలో టాటా స్టీల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎస్‌బీఐ, బజాజ్ ఫినాన్స్‌, టెక్ మహీంద్రా, నెస్లే ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, టైటన్‌ షేర్లు లాభాల్లో ముగియగా.. డాక్టర్‌ రెడ్డీస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, సన్‌ఫార్మా, కొటాక్‌మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్‌, ఏషియన్ పెయింట్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐటీసీ షేర్లు నష్టాలు చవిచూశాయి.

ఇది కూడా చదవండి :పాండ్యాకు కరోనా.. రెండో టీ20 వాయిదా

Advertisement

తాజా వార్తలు

Advertisement