దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ప్రారంభమై.. ఆద్యంతం అదే ఒరవడితో కొనసాగి.. చివరికి భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ సానుకూల సంకేతాలకు తోడు దేశీయంగా ఎలాంటి ప్రతికూల వాతావరణం లేకపోవడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలపర్చింది. సెన్సెక్స్ ఉదయం 57,814.76 పాయింట్ల వద్ద ప్రారంభమై 58,001.53 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 57,639.35 పాయింట్ల వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 17,297.20 పాయింట్ల వద్ద ప్రారంభమై.. 17,343.65 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,235.70 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి సెన్సెక్స్ 350.16 పాయింట్లు ఎగిసి 57,943.65 పాయింట్ల వద్ద, నిఫ్టీ 103.30 పాయింట్లు లాభపడి 17,325.30 పాయింట్ల వద్ద ముగిసింది. నేటి టాప్ గెయినర్స్ జాబితాలో ఐచర్ మోటార్స్, అదానీ పోర్ట్స్, దివిస్ ల్యాబ్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్డీఎఫ్సీ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో హీరో మోటోకార్ప్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఐవోసీ, ఐటీసీ ఉన్నాయి.
రూ.1.38లక్షల కోట్లు లాభాలు..
బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ క్రితం సెషన్ నాటికి రూ.2,61,63,331.19 కోట్లు క్రాస్ చేసింది. సోమవారం రూ.1.38 లక్షల కోట్ల లాభాన్ని ఇన్వెస్టర్లు అందుకున్నారు. దాదాపు అన్ని రంగాలు లాభాల్లో ముగిశాయి. కేవలం ఆయిల్ అండ్ గ్యాస్ మాత్రమే నష్టపోయాయి. ఫార్మా, రియాల్టిd 1 శాతం చొప్పున, క్యాపిటల్ గూడ్స్ 0.65 శాతం లాభపడ్డాయి. చమురు ధరలు ఇటీవలి గరిష్టాల నుంచి దిగిరావడం సైతం మార్కెట్లకు కలిసి వచ్చింది. గత వారం హీరో మోటోకార్ప్‌కు చెందిన సంస్థల్లో ఆదాయ పన్ను విభాగం సోదాలు జరిపింది. దీంతో ఇంట్రాడేలో 9శాతం నష్టపోయింది. గత రెండేళ్లలో ఇదే అతిపెద్ద ఒకరోజు నష్టం కావడం గమనార్హం. అదానీ పవర్ షేర్లు 19 శాతం లాభపడి.. 52 వారాల గరిష్టాన్ని తాకాయి. ఆరు సెషన్స్‌లో ఈ షేరు ధర 37 శాతం పెరిగింది. వివిధ అనుబంధ సంస్థల విలీన ప్రక్రియ కారణంగా ర్యాలీ కొనసాగుతున్నది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..