జమ్మూ : భారత్ లో తొలిసారి ఘనీభవించిన సరస్సుపై మారథాన్ నిర్వహించనున్నారు. ఈ నెల 20వ తేదీన లద్దాక్ లోని పాంగాంగ్ సరోవరంలో ప్రపంచంలో ఎత్తయిన “ఘనీభవించిన సరస్సుపై పరుగు” (ఫ్రోజెన్ లేక్ మారథాన్) నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రీడల్లో 75 మంది స్వదేశీ, విదేశీ అథ్లెట్లు పాల్గొననున్నారు. లాస్ట్ రన్ పేరుతో గడ్డకట్టిన సరస్సుపై పోటీలు నిర్వహించనున్నారు. లడాఖ్ వేదికగా జరగనున్న తొలి మారథాన్‌గా చరిత్రలో నిలవనుంది. ఈ గేమ్స్‌కి భారీ భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు చేస్తున్నారు. 13,862 అడుగుల ఎత్తున ఉన్న ఈ సరస్సు 700 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంటుంది. ప్రస్తుత శీతాకాలంలో ఇక్కడ మైనస్ 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. 21 కిలోమీటర్ల ఈ మారథాన్ పరుగు లుకుంగ్ నుంచి మాన్ గ్రామం వరకు కొనసాగుతుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement