కృష్ణగారి ఆఫీస్ ఎప్పుడు కళ కళలాడుతూ ఉండేదని నటుడు..దర్శకుడు..నిర్మాత ఆర్.నారాయణమూర్తి తెలిపారు. కాగా కృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించారు. అనంతరం నారాయణమూర్తి మాట్లాడుతూ.. నిజంగా కృష్ణ బంగారం.. ఎంతో మంది నిర్మాతలను ఆయన నిలబెట్టారు. సక్సెస్ అయితే సంతోషం. ఒకవేళ ఫెయిల్ అయితే ఆ నిర్మాతలను పిలిచి, వారికి డేట్స్ ఇచ్చి నిలబెట్టిన మహనీయుడు, గొప్ప మనసున్న మారాజు కృష్ణ. అల్లూరి సీతారామరాజు లాంటి మహాద్బుతమైన కావ్యాన్ని సినిమా చేయాలని ఎన్టీఆర్ ఎన్నో సార్లు అనుకున్నారు. స్క్రిప్ట్ కూడా రాసుకున్నారు. రాయించుకున్నారు. అదే టైంలో కృష్ణ సినిమా చేశారు. నందమూరి తారకరామారావుకు ఆ సినిమా చూపిస్తే ఆయన కృష్ణతో..బ్రదర్ కృష్ణ ఇక మేం ఆ సినిమా తీయం. ఈ చిత్రాన్ని అద్బుతంగా తీశారు. గొప్పగా తీశారు..అని సాక్షాత్తు ఆయనను ఆశీర్వదించారు. దటీజ్ హీరో కృష్ణ అని అన్నారు పీపుల్స్ స్టార్ .
Advertisement
తాజా వార్తలు
Advertisement