కొత్తగూడెం భద్రాద్రి జిల్లా కేంద్రంలో జరుగుతున్న భూ ఆక్రమణలపై మావోయిస్టులు కన్నెర్ర చేశారు. ఐటీడీఏ వెనకాల ఉన్న చెరువు సర్వే నెంబర్ 111/5లోని 4.15 ఎకరాల ప్రభుత్వ భూమిని పలు రాజకీయ పార్టీ నేతలు రెవెన్యూ, పోలీసుల అండతో ఆక్రమించుకుంటున్నారని ఇవ్వాల (మంగళవారం) విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం–అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ ఈ లేఖను విడుదల చేసింది. జల్ జంగిల్, జమీన్ నినాదం.. దోపిడీకి గురవుతున్న ప్రజల నినాదంగా మారాలని మావోయిస్టు బీకే ఏఎస్ఆర్ డివిజన్ కార్యదర్శి ఆజాద్ పిలుపునిచ్చారు. భూ ఆక్రమణలకు పాల్పడుతున్న నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పద్ధతి మార్చుకోకుంటే ప్రజా కోర్టులో శిక్ష తప్పదన్నారు. లేఖ పూర్తి వివరాలు దిగువన చూడొచ్చు..