తెలంగాణ -ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే, ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అని సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ అధికార ప్రతినిధి జగన్ అన్నారు. ఈ మేరకు ఆయన ఓ లేఖ విడుదల చేశారు. తెలంగాణ పోలీసులకు ఒక ద్రోహి సమాచారం ఇవ్వడం వల్లే ఈ ఎన్‌కౌంటర్ జరిగిందన్నారు. పోలీసులు ఏకపక్షంగా కాల్పులు జరిపారని చెప్పారు. ఈ ఎన్‌కౌంటర్‌లో రీజనల్ సెంటర్ సీ ఆర్‌సీ కంపెనీ-2కు చెందిన కామ్రేడ్స్ నరోటి దామాల్, మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా గట్ట ఏరియాకు చెందిన పూనెం భద్రు, బీజాపూర్ జిల్లాలోని పెద్దకోర్మ గ్రామానికి చెందిన సోడి రామాల్ అలియాస్ సంతోష్, బీజాపూర్ జిల్లా బాసగూడెం ప్రాంతం మల్లిపాడుకు చెందిన కామ్రేడ్లు మరణించినట్టు జగన్ లేఖ ద్వారా ప్రకటించారు.
ఇది కూడా చదవండి: దద్దరిల్లిన దండకారణ్యం.. లోదేడు కొత్తపల్లి గుట్టలో ఎన్ కౌంటర్.. ముగ్గురు మావోయిస్టుల మృతి