ఉక్రెయిన్ రసాయన ఆయుధాలను తయారు చేస్తోందని, తమపై దాడికి వ్యూహం రచిస్తోందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఆరోపించారు. చర్చల అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌లో జీవ ఆయుధాల తయారీకి వాషింగ్టన్ నుంచి నిధులు వచ్చాయన్నారు. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇగోర్ కోనాషెంకోవ్ కూడా ఉక్రెయిన్‌లో ప్రాణాంతక వ్యాధికారకాలను రహస్యంగా వ్యాప్తి చేయడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడమే గాక.. యూఎస్ నిధులు సమకూర్చిందన్నారు.
ఉక్రెయిన్‌లో యూఎస్ సైనిక-జీవ సంబంధ కార్యకలాపాల నిర్వహణకు సంబంధించిన పత్రాలు కూడా తమ వద్ద ఉన్నాయన్నారు. ఉక్రెయిన్ ల్యాబోరేటరీలు పక్షి, గబ్బిలం, సరిసృపాల వ్యాధికారక క్రిములపై పరిశోధనలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిందని ఆరోపించారు. ఫ్రికన్ స్వైన్ ఫీవర్, ఆంత్రాక్స్‌పై పరిశోధనలు చేయనుందని విమర్శించారు. ఆఖరికి కరోనా వైరస్ నమూనాలతో కూడి ప్రయోగాలు చేస్తున్నారని ఆరోపించారు. అమెరికన్‌లు ఈ పనిని చాలా రహస్యంగా ఉక్రెయిన్‌లో కొనసాగిస్తున్నారన్నారు. రష్యా సరిహద్దులోనే సైనిక-జీవ ల్యాబ్‌లను సృష్టించారని ఆరోపణలు చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..