కెఎస్‌ఎస్‌ఎం షూటింగ్ టోర్నీలో ఉమెన్స్ అండ్ జూనియర్ ఉమెన్స్ 10మీటర్ల ఏయిర్ పిస్టోల్ టైటిల్స్‌ను ఒలింపియన్, మాజీ వరల్డ్ నంబర్ 1 మను భకర్ చేజిక్కించుకుంది. రెండు గోల్డ్ మెడల్స్‌ను కైవసం చేసుకుంది. భోపాల్‌లోని ఎం.పీ. షూటింగ్ అకాడమీ రేంజ్‌లో నిర్వహించిన 20వ కుమార్ సురేంద్ర సింగ్ మెమోరియల్ (కెఎస్‌ఎస్‌ఎం) షూటింగ్ కాంపిటీషన్‌లో హర్యానా షూటర్ మను భకర్, ప్రత్యర్థి పంజాబ్ షూటర్ అర్షదీప్ కౌర్‌ను 16-14 తేడాతో ఓడించింది. 8మంది ఉమెన్ సెమీ-ఫైనల్‌లో మను 263.9తో టాప్‌లో నిలిచిన విషయం తెలిసిందే. మను గోల్డ్ మెడల్ సాధించగా, మరో హర్యానా షూటర్ రాధిక తన్వర్ రజత పతకం చేజిక్కించుకుంది.
ఇక జూనియర్ విభాగంలో మను భకర్ ప్రత్యర్థి యూపీ షూటర్ యువిక తోమర్‌ను 16-12 తేడాతో ఓడించి, టైటిల్‌ను కైవసం చేసుకుంది. గోల్డ్ మెడల్ కూడా చేజిక్కించుకుంది. మరో హర్యానా షూటర్ లక్షిత రజతం పతకం సాధించింది. యూత్ కేటగిరిలో శిఖా నార్వల్ టైటిల్ సాధించింది. టీమ్‌ల పరంగా యువిక నేతృత్వంలోని అంజలి చౌదరి, దేవాన్షి ధామా జట్టు గోల్డ్ మెడల్ సాధించింది. హర్యానా జట్టు వెండి, మహారాష్ట్ర టీం రజత పతకం చేజిక్కించుకుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.