హైదరాబాద్ .. భాగ్యనగరానికి నేడు తొలకరి పలకరించింది. 20 రోజులుగా నైరుతి రుతపవనాలు ధోభూచు ఆటతో ఎండలు మండిపోతున్నాయి. నేటి మధ్యాహ్నం వరకు కూడా ఎండ దంచికొట్టింది. మధ్యాహ్నం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. సాయంత్రానికి వర్షం కురిసింది. నగరం ఒక్కసారిగా చల్లబడింది. దీంతో నగర ప్రజలకు ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగింది. .
తార్నాక, రాంనగర్, ఉస్మానియా యూనివర్సిటీ, లాలాపేట, సికింద్రాబాద్, హబ్సిగూడ, బేగంపేట, సోమాజిగూడ, అమీర్‌పేట, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, నాంపల్లి, లక్డీకాపూల్, నాంపల్లి, కోఠి, అంబర్‌పేట, ముషీరాబాద్, చిక్కడపల్లి, ఉప్పల్, బోడుప్పల్, ఎల్‌బీనగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది… అలాగే నగర శీవారు ప్రాంతాలలో సైతం సన్నని చిరు జల్లులు పడ్డాయి.