Thursday, December 12, 2024

TG | మ‌నోజ్ క్ష‌మాప‌ణ‌లు.. హైకోర్టు మెట్లెక్కిన మోహ‌న్ బాబు

హైద‌రాబాద్ – గత రెండు రోజులుగా జరుగుతున్న మంచు ఫ్యామిలీ వివాదానికి ఇంకా తెరపడలేదు. నిన్న రాత్రి జరిగిన పలు నాటకీయ పరిణామాల మధ్య మోహన్ బాబు ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ వివాదం ప‌ట్ల పోలీసులు సీరియ‌స్ అయ్యారు.. నేడు మంచు కుటుంబస‌భ్యులు విచార‌ణ‌కు హాజ‌రుకావాల్సిందిగా పోలీసులు నోటీసులు జారీ చేశారు.. ఈ నోటీస్ ల‌పై అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన మోహ‌న్ బాబు హైకోర్టును ఆశ్ర‌యించారు. త‌న‌కు ఇచ్చిన నోటీస్ ను ర‌ద్దు చేయాల‌ని ఆ పిటిష‌న్ లో కోరారు…

ఇదిలా ఉంటే గ‌త రాత్రి మోహ‌న్ బాబు మీడియా ప్ర‌తినిధులపై దాడి చేయ‌డంతో ఇవాళ మీడియా సంఘాలు న్యాయం కోసం ధ‌ర్నాకు దిగాయి.. మోహ‌న్ బాబుపై కేసు న‌మోదు చేయాల‌ని డిమాండ్ చేశారు మీడియా ప్ర‌తినిధులు. ఈ నేపథ్యంలోనే ఆయన మీడియాతో మాట్లాడుతూ… తన కోసం వచ్చిన జర్నలిస్టులకు ఇలా జరగడం బాధాకరం అంటూ క్షమాపణ కోరుతున్నానని వెల్లడించారు.

నాన్న సారీ చెప్పాలి…
తనకు సపోర్ట్ చేయడానికి వచ్చిన జర్నలిస్ట్ లకు ఇలా జరగడం చాలా బాధాకరంగా ఉంది అంటూ కామెంట్ చేశారు. మీడియా ప్రతినిధులపై దాడి చేయడం తప్పే అని, తన తండ్రి మోహన్ బాబు చేసిందే తప్పే అని అన్నాడు. అంతేకాకుండా, మీడియా జర్నలిస్ట్ పై దాడి చేసి తప్పు చేసిన తన మోహన్ బాబు ఫాంహౌస్ నుంచి బయటికి వచ్చి క్షమాపణలు చెప్పాలని మంచు మనోజ్ డిమాండ్ చేశారు. మంచు మోహన్ బాబు ఫాంహౌస్ గేట్ దగ్గరే కూర్చుని మోహన్ బాబు బయటికి రావాలని చెప్పాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

నేను ఆస్తి అడగలేదు…
“నేను కానీ, నా భార్య కానీ ఎప్పుడూ ఆస్తి, డబ్బులు అడగలేదు. నా భార్య 7నెలల గర్భవతిగా ఉన్న నాటి నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాను. ఇప్పటి వరకు అన్ని అనుభవించా.. ఇక ఆగలేను. అలాగే రాత్రి అమ్మ ఆస్పత్రిలో ఉంది అంటూ రాత్రి అబద్దాలు చెబుతున్నారు. నాపై ఆరోపణలు చేస్తున్నారు. నా భార్య పేరును లాగుతున్నారు. నా పిల్లలను లాగుతున్నారు” అంటూ మంచు మనోజ్ ఎమోషనల్ అయి కన్నీరు పెట్టుకున్నారు.

ప్రేమించుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తప్పా…?
“నేను చేసిన తప్పు ఏం లేదు. ఎంతో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నా అంతే. అదే చేసినా తప్పా.. నా కోసం మౌనిక వచ్చింది. వాళ్ల ఇంటి నుంచి డబ్బులు ఏం తీసుకురాలేదు. ఆమె కోసం నేను నిలబడ్డాను. అది వాళ్లకు నచ్చలేదు. అన్న కంపెనీల్లో పనిచేశాను. వాళ్ల కోసం పనిచేశాను. పాటలు చేశాను. వాళ్ల సినిమాల్లో చేశాను. డైరెక్షన్ చేశాను. ఎప్పుడూ డబ్బులు అడగలేదు” అంటూ ఎమోషనల్ అయ్యాడు మంచు మనోజ్.

Advertisement

తాజా వార్తలు

Advertisement