టాలీవుడ్ నటుడు మంచు మనోజ్-భూమా మౌనిక వివాహం గత రాత్రి ఘనంగా జరిగింది. హైదరాబాద్ ఫిలింనగర్లోని మంచు లక్ష్మి నివాసంలో గత రాత్రి 8.30 గంటల సమయంలో మౌనిక మెడలో మనోజ్ మూడుముళ్లు వేశాడు. ఈ వేడుకకు దగ్గరి బంధువులు, ఇరు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. టీజీ వెంకటేశ్, కోదంరామిరెడ్డి, పరుచూరి గోపాలకృష్ణ, నిక్కీ గల్రానీ, దేవినేని అవినాశ్ తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వధువు మౌనికా రెడ్డికి దివంగత భూమా నాగిరెడ్డి-శోభానాగిరెడ్డి రెండో కుమార్తె . ఈ వివాహానికి భూమా అఖిల ప్రియ, ఆమె సోదరుడు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. .
Advertisement
తాజా వార్తలు
Advertisement