పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిది లక్కీ హ్యాండ్ అని రాష్ట్ర ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు. బుధవారం పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ మనోహర్ అన్న ఏది ముట్టుకున్నా బంగారం అవుతుందన్నారు. ప్రతిక్షణం ప్రజల కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం తపనపడతారన్నారు. మాతా శిశు కేంద్రం ప్రారంబించుకున్నామని, జనరల్ ఆసుపత్రి ని బలోపేతం చేయాలని మనోహరన్న కోరుతున్నారన్నారు. త్వరలోనే మరి కొంతమంది వైద్యనిపుణులను కేటాయిస్తామన్నారు.
ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నియోజకవర్గం లో 29 ఏఎన్ఎం కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారని, వారం రోజుల్లో ఆరు కోట్ల రూపాయలు మంజూరు చేస్తామన్నారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ కోసం వివిధ ప్రాంతాలకు నియోజకవర్గ ప్రజలు వెళుతూ ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే విన్నవించారని, వారం రోజుల్లో పెద్దపెల్లి ఆస్పత్రిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. అభివృద్ధి ఎజెండాగా పని చేస్తున్న మనోహర్ రెడ్డి లాంటి ఎమ్మెల్యే ఉండటం అదృష్ట మన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..