Sunday, December 29, 2024

Manmohan Singh Funeral: మన్మోహన్ సింగ్ మహాభినిష్క్రమణ నేటి షెడ్యూల్ ఇదే

న్యూ ఢిల్లీ – మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు మూడు రోజు జరగనున్నాయి. గురువారం రాత్రి కన్నుమూసిన ఆయన అంత్యక్రియలు శనివారం నిర్వహించనున్నారు.

మాజీ ప్రధాని అంత్యక్రియలు ఎక్కడ? ఎప్పుడూ? ఏ సమయానికి అనే వివరాలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అంత్యక్రియలు న్యూఢిల్లీలో నిగమ్‌ బోధ్‌ ఘాట్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి. ముందుగా మాజీ ప్రధానికి 21 గన్ సెల్యూట్ చేయనున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను ప్రత్యేక భద్రతా ప్రోటోకాల్‌లతో చేయనున్నారు. ఈ అంత్యక్రియలు పూర్తి ప్రభుత్వ అధికారిక గౌరవాలతో జరపనున్నారు.

- Advertisement -

ఢిల్లీలోని మోతీలాల్‌ నెహ్రూ రోడ్డులోని మన్మోహన్‌ సింగ్‌ నివాసం నుంచి శనివారం ఉదయం కాంగ్రెస్‌ పార్టీకి తరలించారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, అభిమానులు సందర్శించి నివాళులర్పించారు. . అనంతరం అక్కడ నుంచి నిగమ్‌ బోధ్‌ ఘాట్‌ వరకు అంతిమయాత్ర జరపనున్నారు. ఘాట్‌లో 11.15 నుంచి హోం శాఖ కార్యదర్శి మొదలు.. 11.42 గంటలకు ఆఖరును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చివరి నివాళులర్పించనున్నారు. అనంతరం అంత్యక్రియలు జరుగుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement