Saturday, November 23, 2024

మ‌ణిర‌త్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వ‌న్- ద‌ర్శ‌కుడికి విజ‌యాన్ని అందించిందా..!

భారీ తారాగ‌ణం..భారీ బ‌డ్జెట్ తో పొన్నియిన్ సెల్వ‌న్ చిత్రాన్ని తెర‌కెక్కించారు స్టార్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం.ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం.

కథ ఏంటంటే- వెయ్యి సంవత్సరాల క్రితం పరిపాలన సాగించిన చోళ రాజ్యపు రాజుల గొప్పతనం గురించి చెప్తూ ఈ కథ మొదలవుతుంది. అప్పటి చోళ రాజ్యంను ఎలాగైనా సామ,దాన,దండోపాయాలతో దక్కించుకునేందుకు చాలా మంది ప్రయత్నిస్తూంటారు. అది రాజు ఆదిత్య కరికాలుడు(విక్రమ్‌) కు ఓ సవాల్ గా మారుతుంది. తనదైన శైలిలో తన రాజ్యాన్ని రక్షించేందుకు వ్యూహాలు రచిస్తూంటాడు.…ఆ క్రమంలో రాజ్య ఆక్రమణ కోసం,వారసులను చంపటం తన వెనక పెద్ద కుట్ర జరుగుతోందని తలుస్తోంది. ఆ కుట్రను ఛేదించటానికి …. కరికాలుడు… వల్లవయాయ (కార్తి) ని పంపుతాడు. ఈ క్రమంలో ఏమి బయిటపడింది..అసలు కుట్రకు కీలకం ఎవరు…అరుమౌజి (జయం రవి) ని వల్లవరాయ ఎలా రక్షించాడు…అనేది ఈ భాగంలోని ప్రధాన కథ. ఇందులో కుందవాయి(త్రిష), నందిని(ఐశ్వర్య రాయ్‌) పాత్రలు కీలకంగా మారాయి.

విశ్లేష‌ణ‌- మెగాస్టార్ చిరంజీవి వాయస్ ఓవర్ తో మొదలయ్యే ఈ చిత్రం చారిత్రక సంఘటనలతో ముడిపడింది. ఈ చిత్రం కథకు మూలం పొన్నియిన్ సెల్వన్ అనే తమిళనాడులో పాపులరైన ఒక చారిత్రక నవల. దీన్ని కృష్ణమూర్తి (1899-1954) రాశారు. ప్రముఖ చరిత్రకారులు కె.ఎ. నీలకంఠ శాస్త్రి రాసిన ‘ది చోళాస్’ పుస్తకం, టి.వి. సదాశివ బండారుతార్ రచించిన ‘హిస్టరీ ఆఫ్ లేటర్ చోళాస్’, ఆర్. గోపాలన్ రాసిన ‘పల్లవాస్ ఆఫ్ కంచి’ అనే పుస్తకాల ఆధారంగా కల్కి ఈ నవలను రాశారు.తన మ్యాగజీన్ ‘కల్కి’ కోసం 1950 నుంచి మూడేళ్ల పాటు ఈ నవలను ఒక సిరీస్ రూపంలో ప్రచురించారు. చోళులలో ప్రసిద్ధుడైన రాజ రాజ చోళుడు-1 తండ్రి పరాంతక చోళుడు-2 కాలంలోని కొన్ని చారిత్రక సంఘటనలను దృష్టిలో ఉంచుకొని కల్కి ఈ నవలను రాశారు. పరాంతక చోళునికే సుందర చోళ అనే మరో పేరు కూడా ఉంది. కల్కి రాసిన ఈ నవలలో చారిత్రక పాత్రలతో పాటు కాల్పానిక పాత్రలు కూడా ఉన్నాయి. కల్కి నవలను 5 భాగాలుగా రాశారు. వాటిన్నటిని బేస్ చేసుకుని ఈ సినిమా తీసారు. మణిరత్నం ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలని ప్లాన్ చేశారు. మణిరత్నం కంటే ముందు చాలామంది ఈ నవలను సినిమాగా తీయడానికి ప్రయత్నించారు. కానీ కుదరలేదు. ఇన్నాళ్లకు తెరకెక్కిన ఈ చిత్రరాజం….తమిళం వాళ్లకు నచ్చే అంశాలతోనే తెరకెక్కింది.

నటీనటులు-ఈ కథలో విలన్ అనేది సరిగ్గా ఎస్టాబ్లిష్ కాకపోవటం … ఓ ఇన్విస్టిగేషన్ స్టైల్ లో కథ కొంతమేర నడవటం తో ఎక్కడా ప్రధాన పాత్రల మధ్య సంఘర్షణ కనపడదు. తెరపై కనిపించే నటులంతా ఆల్రెడీ అద్బుతాలు చేయగలరని ప్రూవ్ అయిన వారే. ముఖ్యంగా విక్రమ్,త్రిష,ఐశ్వర్యరాయ్ వంటి వారు గురించి చెప్పేదేముంది. అందూలోనూ మణిరత్నం వంటి దర్శకుడు చేతిలో పడ్డాక ఆ మాణిక్యాలు మరింత మెరుగు దిద్దుకుంటాయి. అదే జరిగింది. చోళ రాజు ఆదిత్య కరికాలుడు పాత్రలో విక్రమ్‌ నటన అయితే మామూలుగా ఉండదు. ఒక గొప్ప యోధుడి గా మనకు గుర్తుండిపోతాడు. త్రిష, ..వయస్సు పెరుగుతున్నా చెక్కు చెదరని అందం..నందినిగా చేసిన ఐశ్వర్య లుక్ తోనే అభిమానులను ఆకట్టుకుంది. కార్తి కేక పెట్టించాడు. జయం రవి …మనకు అలవాటు తక్కువ వలన ఓకే అనిపిస్తాడు. ప్రకాష్ రాజ్ ఏ పాత్ర చేసినా పాదరసంగా మారిపోతాడు.

- Advertisement -

టెక్నికల్ – కల్కి వంటి పెద్ద నవలను…కుదించి, క్యారక్టర్స్ ని కొన్ని మాత్రమే తీసుకుని స్క్రిప్టు రాయటం అంటే మాటలు కాదు. అందులోనూ ఈ జనరేషన్ కు అర్దమయ్యేటట్లు ఆ కథను చెప్పాలి. అప్పట్లో అంటే కల్కి చదివిన వారు ఎక్కువమంది ఉండేవారు కాబట్టి ఈజీగా అర్దమవుతుంది. ఇప్పుడు అంటే చాలా సులభంగా అర్దమయ్యేలా చెప్పగలిగాలి. ఆ విషయంలో దాదాపు మణిరత్నం సక్సెస్ అయ్యారు. తెలుగువారికే ఆ చరిత్ర, పాత్రలు కాస్త ఇబ్బంది పెడతాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. పాటలు తమిళ ఫ్లేవర్ తో నిండిపోయాయి.. బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్ సీన్స్ బలం చేకూర్చారు. వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ కూడా అద్బుతం అని చెప్పలేం కానీ బాగుంది. తెలుగు లో డబ్బింగ్ డైలాగులు తణికెళ్ళ భరణి రాసారు. కొన్ని చోట్ల ఒరిజనల్ లోని గాఢత వర్కవుట్ అయ్యింది. ఎడిటింగ్‌ లో చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి.తెలుగు వారికి న‌చ్చుతుందో న‌చ్చ‌దో కానీ ..త‌మిళంలో హిట్ట్ అవుతుంద‌నిపిస్తోంది. థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల సంద‌డి మేర‌కు ఈ చిత్రం జ‌యాప‌జ‌యాలు ఆధార‌ప‌డి ఉంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement