Friday, November 22, 2024

మాణిపూర్ లో మళ్లీ ఘర్షణలు – ముగ్గురు మృతి

మాణిపూర్ మళ్లీ అట్టుడుకుతోంది. కాంగ్‌పోక్పి జిల్లాలో మంగళవారం ఉదయం ముగ్గురు గిరిజనులను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. గిరిజనులు అధికంగా ఉండే కంగ్గుయ్ ప్రాంతంలోని ఇరెంగ్, కరమ్ వైఫే గ్రామాల మధ్య ఈ దాడి జరిగిందని కాంగ్ పోక్పి అదనపు పోలీసు సూపరింటెండెంట్ తోలు రాకీ తెలిపారు.

.

మరోవైపు ఈ దాడిని కాంగ్‌పోక్పికి చెందిన కమిటీ ఆఫ్ ట్రైబల్ యూనిటీ ఖండించింది. లోయలోని అన్ని జిల్లాలను కేంద్ర ప్రభుత్వం అస్తవ్యస్త ప్రాంతాలుగా ప్రకటించాలని సామాజిక సంస్థ పేర్కొంది. మరోవైపు ఘటనా స్థలానికి పోలీసులు, అస్సాం రైఫిల్స్ బలగాలు చేరుకున్నాయి. భద్రత బలగాలు సంయుక్తంగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయని పోలీస్ అధికారి తెలిపారు. మృతులను కుకి గొడుగు సమూహమైన ఇండిజెనియస్ ట్రైబల్ లీడర్స్ ఫోరంకు చెందిన వారిగా గుర్తించారు. మృతులు ముగ్గురు కుకి-జో నివాసితులని, సాయుధ దుండగులు సైనిక దుస్తులు ధరించారని గిరిజన ఐక్యత కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement