ఢిల్లీ – పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి.. కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం తిరిగి లోక్ సభ మధ్యాహ్నం ప్రారంభమైంది.. సమావేశం ప్రారంభమైన వెంటనే విపక్షాలు మణిపూర్ ఘటనను లెవనెత్తారు.. ఈ సంఘటనపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. బాధితులకు తక్షణ న్యాయం చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు..
మూడు నెలలుగా మణిపూర్ అల్లర్లతో అట్టుడుగుతుంటే ప్రధాని, హోం మంత్రి ఏం చేస్తున్నారంటూ నినిదాలతో విపక్షాలు హోరెత్తించాయి.. దీంతో సభను రేపటికి వాయిదా వేశారు స్పీకర్ .. అలాగే రాజ్యసభలో సైతం విపక్షాలు మణిపూర్ సంఘటనపై ఆందోళనకు దిగడంతో రేపటికి వాయిదా వేశారు