ఢిల్లీ: మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనను సుప్రీం కోర్టు సుమోటోగా తీసుకుంది. ఈ ఘటనపై ఏం చర్యలు తీసుకున్నారని కేంద్రం, మణిపుర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మహిళలపై అమానవీయ ఘటన రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. బహిర్గతమైన వీడియోలతో ప్రజలు తీవ్ర ఆవేదనకు గురయ్యారని పేర్కొంది.
ఆ వీడియోలు తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచించింది.. కాగా ఇప్పటికే ఆ వీడియోలు తొలగించాలని సంబంధిత శాఖలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.