కరోనా నేపథ్యంలో ప్రజల్లో భయాందోళనను తగ్గించేందుకు అంబులెన్స్‌ల సైరన్‌ను నిలిపివేయాలని మణిపూర్ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ సంచాలకుడు అన్ని జిల్లాల ముఖ్య వైద్యాధికారులకు, మెడికల్ సూపరింటెండెంట్‌లకు, ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులకు, అంబులెన్స్ ఆపరేటర్లకు ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రజలు భయభ్రాంతులను తొలగించేందుకు సామాజిక ఆందోళనకు గురికాకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ట్రాఫిక్ స్తంభించిన చోటే సైరన్ ఆన్ చేయాలని సూచించారు. కొవిడ్ నేపథ్యంలో ఇప్పటికే మణిపూర్‌లో ఆ రాష్ట్ర ప్రభుత్వం తూర్పు, పశ్చిమ ఇంఫాల్‌తో పాటు పలు జిల్లాల్లో ఈనెల 28 వరకు కర్ఫ్యూ విధించింది.