Saturday, November 23, 2024

ఆర్థికంతో పాటు ఆరోగ్యానికి సూపర్‌ టాప్‌ అప్‌ ప్లాన్‌.. బీమా కంపెనీ కవరేజీ అప్‌గ్రేడ్‌

కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ ఒక్కరు ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ చూపుతున్నారని, వైరస్‌ ప్రభావం.. ప్రతీ ఒక్కరిని బ్యాకప్‌ ప్లాన్‌కు దారితీసిందని మణిపాల్‌ సిగ్నా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ చీఫ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఆఫీసర్‌ శశాంక్‌ చాఫేకర్‌ అభిప్రాయపడ్డారు. ఆర్థికంతో పాటు ఆరోగ్యం శ్రేయస్సుపై దృష్టి సారిస్తున్నట్టు తెలిపారు. ఫలితంగా వ్యక్తిగత బీమా ప్లాన్‌ను కలిగి ఉండేందుకు నిర్ణయిస్తున్నట్టు వివరించారు. నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను పొందేందుకు బీమా మొత్తం సరిపోకపోతే.. ఏం చేయాలన్న ఆలోచన ప్రతీ ఒక్కరిలో వస్తుందన్నారు. అవసరమైన సమయంలో.. తగినన్ని సాయం పొందేందుకు బీమా ప్లాన్‌ను ఎంపిక కీలకమన్నారు. సూపర్‌ టాప్‌ అప్‌ ప్లాన్‌ ద్వారా ఆరోగ్య బీమా కవర్‌ను అప్‌గ్రేడ్‌ చేయడానికి ఎంతో కీలకం అని వివరించారు. సూపర్‌ టాప్‌ అప్‌ ప్లాన్‌ అనేది.. వ్యక్తిగత, కుటుంబ సభ్యుల ఆరోగ్య సంరక్షణ కోసం రూపొందించబడింది. వైద్య అందించే సమయం వచ్చే సరికి చాలా మంది చేతుల్లో డబ్బుల్లేకుండాపోతుంటాయి.

లక్ష నుంచి 30లక్షల వరకు బీమా..

సూపర్‌ టాప్‌ అప్‌ హెల్త్ ప్లాన్‌.. మీ కవర్‌ మొత్తాన్ని అధిక స్థాయికి అప్‌గ్రేడ్‌ చేయడం ద్వారా.. ఆరోగ్య బీమా ప్లాన్‌ను టాప్‌ అప్‌ చేస్తుంది. సూపర్‌ టాప్‌ అప్‌ హెల్త్ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ ఆరోగ్య అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారని నిర్ధారిస్తుంది. ఈ ప్లాన్‌ అందించే కవర్‌ గ్రౌండ్‌ అప్‌ నుంచి ప్రారంభమయ్యే పాలసీ కంటే తక్కువ ఉంటుంది. చౌకగా కూడా ఉంటుంది. ప్రస్తుత ఆరోగ్య బీమా కవర్‌ను అప్‌గ్రేడ్‌ చేయడానికి సూపర్‌ టాప్‌ అప్‌ ప్లాన్‌ ఖర్చుతో కూడుకున్న మార్గం. ఈ ప్లాన్‌లు.. రూ.1 లక్ష నుంచి రూ.30లక్షల వరకు బీమాను అందిస్తుంటాయి. మరికొన్ని అదనపు ఫీచర్లు కూడా వస్తాయి. వాటిలో ఒకటి గ్యారెంటీడ్‌ కంటిన్యూటీ బెనిఫిట్‌. ఇప్పటికే ఆరోగ్య బీమా ప్లాన్‌లను కలిగి ఉన్న చాలా మంది వ్యక్తులు.. అదనపు ప్రయోజనాల కోసం సూపర్‌ టాప్‌ అప్‌ ప్లాన్‌లను కొనుగోలు చేస్తుంటారు. సూపర్‌ టాప్‌ అప్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ను కొనుగోలు చేయడం కీలకం. కొన్ని కార్పొరేట్‌ కంపెనీలు ఇన్సూరెన్స్‌ ఇస్తుంటాయి. కానీ కుటుంబంలోని అందరికీ దాన్ని వర్తింపజేయవు. దీంతో ఆరోగ్య సంరక్షణ ఖర్చులు పెరుగుతుంటాయి. ఒక సూపర్‌ టాప్‌ అప్‌ ప్లాన్‌ ద్వారా.. అదనపు ఖర్చులు కూడా ఆర్థికంగా కొంత బలాన్ని ఇస్తుంటాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement