ప్రముఖ గాయని మంగ్లీ వివాదంలో చిక్కుకుంది. తెలంగాణలో ఆషాఢం బోనాల సీజన్ సందర్భంగా ఆమె పాడిన పాటపై విమర్శలు వస్తున్నాయి. ఆ పాటకు రామస్వామి సాహిత్యం అందించగా, రాకేశ్ వెంకటాపురం సంగీతం అందించారు. అయితే ఆ భక్తి గీతంలోని కొన్ని పదాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అమ్మవారిని దూషిస్తున్నట్టుగా కొన్ని పదాలు ఉన్నాయంటూ విమర్శలు వస్తున్నాయి.
తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపం వంటి బోనాలను కించపరిచేలా ఈ పాట ఉందని, దేవతను మొక్కినట్టుగా కాకుండా, తిడుతున్నట్టుగా ఉందని, ఇలాంటి పాటను మంగ్లీ ఎలా పాడిందని భక్తులు మండిపడుతున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఈ గేయం ఉందని, మంగ్లీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ పాటలోని పదాలను మార్చాలని కొందరు కోరుతున్నారు.
ఈ వార్త కూడా చదవండి: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం