వివాదస్పద మూవీ ‘ది కేరళ స్టోరీ కి మధ్యప్రదేశ్ ప్రభుత్వం పన్ను మినహాయింపు ప్రకటించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ విషయాన్ని శనివారం వెల్లడించారు. పిల్లలు, పెద్దలూ అందరూ తప్పకుండా ఈ చిత్రాన్ని చూడాలన్నారు. ‘మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే మత మార్పిడుల నిరోధానికి చట్టం తీసుకొచ్చింది. ఈ చిత్రం కూడా మతమార్పిడులపై అవగాహన తీసుకొస్తోంది. కాబట్టి తల్లిదండ్రులు, చిన్నారులు, ఆడ పిల్లల అందరూ వీక్షించదగ్గ చిత్రం. అందుకే మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ చిత్రానికి పన్ను రాయితీ ఇస్తోంది” అని చౌహాన్ అన్నారు.
అదా శర్మ నటించిన ‘ది కేరళ స్టోరీ మూవీని విపుల్ షా నిర్మించగా, సుదీప్తో సేన్ దర్శకత్వం వహించారు. బహుభాషా చిత్రమైన కేరళ స్టోరీ శుక్రవారం దేశమంతటా విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది..
‘ది కేరళ స్టోరీ’ మూవీకి మధ్యప్రదేశ్ లో పన్ను మినహాయింపు..
Advertisement
తాజా వార్తలు
Advertisement