మాండూస్ తుఫాన్ ప్రభావం కారణంగా తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గత మూడు నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులు బెంగళూరులో భారీ నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసేందుకు భారత వాతావరణ సంస్థ ఆదివారం బెంగళూరులో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. డిసెంబర్ 12 వరకు ఉరుములు, మెరుపులతో పాటు ఆకాశం మేఘావ్సతంగా ఉంటుందని. గాలులు బలంగా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయని, వాతావరణం చల్లబడుతుందని వెల్లడించింది. ఉష్ణోగ్రత 16.8 డిగ్రీల సెల్సియస్ నమోదు అయింది.
శనివారం బెంగళూరులో భారీ వర్షం కురిసింది. దాంతో, రోడ్లన్ని జలయమం కావడంతో వాహనదారులు ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. తుఫాన్ ఇప్పటికే తమిళనాడులో నలుగురిని పొట్టనబెట్టుకుంది. అయితే బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడిందని, దాంతో, మాండూస్ తుఫాన్ ప్రభావం తగ్గవచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.