‘మా’ ఎన్నికల నేపథ్యంలో సీనియర్ నటుడు మోహన్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంతో ఉన్నత ఆశయాలతో ‘మా’ ఏర్పాటైందన్నారు. తెలుగు నటీనటులందరూ ఒక్కటిగా ఉందామని, అతిరధ మహారథులు పెట్టింది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అని అన్నారు. గతంలో మా ఎన్నికలు ఏకగ్రీవమయ్యేవని గుర్తు చేశారు. ఇప్పుడు కొందరు సభ్యులు జబారుకెక్కి నవ్వుల పాలవుతున్నారని వ్యాఖ్యానించారు. ఎవరు ఎన్ని చేసినా ‘మా’ ఒక కుటుంబం అని అన్నారు. మా అధ్యక్షుడిగా పోటీచేస్తున్న మీ కుటుంబ సభ్యుడు మంచు విష్ణు, అతడికి ప్యానెల్‌కు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఓటేసే ముందు మనస్సాక్షితో ఆలోచించి ఓటేయాలని పిలుపునిచ్చారు. మేనిఫెస్టోలోని హామీలను విష్ణు నెరవేరుస్తారని తెలిపారు. విష్ణు గెలిచాక రెండు రాష్ట్రాల సీఎంలను కలుస్తామన్నారు. సినీ పరిశ్రమ కష్టాలను సీఎంలకు చెప్పుకుందామని మోహన్ బాబు పేర్కొన్నారు. తన కుమారుడు విష్ణు ప్యానెల్‌ను గెలిపించాలని కోరారు. ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని మోహన్ బాబు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: ‘మా’ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలు.. గెలుపు ఎవరికో?