Sunday, November 24, 2024

విష్ణు, మనోజ్ ల మధ్య లడాయి.. ఫేస్ బుక్ వీడియో పోస్ట్ తో బజారున పడ్డ విబేధాలు..(వీడియోతో)

త‌న అన్న‌య్య మంచు విష్ణు తీరుపై మండిప‌డుతూ మంచు మ‌నోజ్ ఓ వీడియోని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కాగా ఆ వీడియోలో మంచు విష్ణును ఇద్దరు వ్యక్తులు ఆపుతుండగా.. ఒరేయ్ అరేయ్ అని ఏదో అంటున్నాడు కదా అంటూ విష్ణు అడగడం కనిపిస్తోంది. ఇదిగో అండి ఇలా ఇంటి మీదకు వచ్చి అందరినీ కొడుతుంటాడు అంటూ మనోజ్ వాయిస్ వినిపిస్తోంది.విష్ణు త‌న అనుచరుడు సారథి ఇంటికి వెళ్లి అతడిపై విష్ణు దాడి చేశాడని, ఇలాగే బంధువుల ఇళ్లల్లో దాడులు చేస్తాడని మనోజ్ ఈ వీడియోలో ఆరోపించాడు. ఈ వీడియోను మనోజ్ తన ఫేస్ బుక్ పేజీలో స్టేటస్ గా పెట్టాడు. అయితే, తండ్రి మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేయడంతో మనోజ్ తన వీడియోను డిలీట్ చేసినట్టు సమాచారం. మంచు వారింట్లో అన్నదమ్ముల మధ్య సఖ్యతలేదని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ‘మనోజ్ గురించి మాట్లాడను.. అది వాడి పర్సనల్’ అంటూ ఆ మధ్య ఓసారి మంచు విష్ణు అన్నాడు. ఎవ్వరికీ సలహాలు ఇవ్వబోనంటూ తన తమ్ముడి గురించి విష్ణు పరోక్షంగా స్పందించాడు. ఇటీవల జరిగిన మనోజ్, భూమా మౌనికల పెళ్లిలోనూ విష్ణు కనిపించలేదు. బంధువులాగా వచ్చి వెళ్లినట్లు సమాచారం. పెళ్లి ఫోటోలు, వీడియోల్లో ఎక్కడా విష్ణు కనిపించలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement