Thursday, December 12, 2024

HYD | మాకు రక్షణ కల్పించండి.. డీజీని కలిసిన మంచు మనోజ్

మనోజ్ ఇంట్లో హైడ్రామా కొనసాగుతుంది. మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య వాగ్వాదం, పరస్పరం పోలీసులకు ఫిర్యాదులు చేసుకోవడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా, మంచు మనోజ్ తన భార్య మౌనికతో కలిసి తెలంగాణ ఇంటెలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డిని కలిశారు. తన ఫ్యామిలీలో జరుగుతున్న పరిణామాలను ఆయనకు వివరించారు. తనకు, తన భార్యకు రక్షణ కల్పించాలని ఆయన కోరారు.

మరోవైపు, కొడుకు మనోజ్, కోడ‌లు మౌనిక నుంచి తనకు ప్రాణహాని ఉందని మోహన్ బాబు లేఖ ద్వారా రాచకొండ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement