మంచు వారి ఇంట పెళ్లి సందడి మొదలైంది. మోహన్ బాబు రెండో కుమారుడు మనోజ్ రెండో పెళ్లికి ఏర్పాట్లు సిద్ధం అయ్యాయి. మంచు మనోజ్ భూమా మౌనికరెడ్డిల వివాహాం నేడు జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా మంచు మనోజ్ తన సోషల్ మీడియా ఖాతా వేదికగా తనకు కాబోయే భార్య ఫోటోను పోస్ట్ చేశాడు.. పెళ్లి కూతురు భూమా మౌనిక అంటూ ఫోటోను పోస్ట్ చేస్తూ… దీనికి మనోజ్ వెడ్స్ మౌనిక అని హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు.గత కొంత కాలంగా ప్రేమికులుగా ఉన్న ఈ ఇద్దరి వివాహం ఈరోజు రాత్రి ఎనిమిది గంటల ముప్ఫై నిమిషాలకు ఉంటుందని సమాచారం. ఇక ఈ పెళ్లి హడావుడి లేకుండా సైలెంట్‌గా అతి తక్కువ మంది సమక్షంలోనే జరగనుంది. ఈ వివాహ కార్యక్రమానికి ముఖ్యులకు మాత్రమే మంచు కుటుంబం ఆహ్వానాలు పంపింది. ఈ వివాహం మనోజ్ సోదరి మంచి లక్షీప్రసన్న ఇంటిలో జరగనుంది. కాగా, మంచు మనోజ్ కి, మౌనికా రెడ్డి కి కూడా ఇది ద్వితీయ వివాహం కావడం విశేషం..
Advertisement
తాజా వార్తలు
Advertisement