మలయాళ సూపర్ స్టార్ మెహన్ లాల్ ‘మాన్‌స్టర్ మూవీలో లెస్బియన్ రోల్‌లో మంచు లక్ష్మీ నటించింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమాలో లక్ష్మీ యాక్టింగ్‌కు మంచి మార్కులే వచ్చాయి. సినిమా మొత్తం ఎలా ఉన్నా.. చివరి 30 నిమిషాల్లో మంచు లక్ష్మి విలనిజం హైలైట్‌గా ఉందని చాలా మంది చెప్పారు. మలయాళ చిత్రం “మాన్‌స్టర్”లో నటి మంచు లక్ష్మీ చేసిన పాత్రకు మంచి పేరే వచ్చింది. ఆ సినిమాలో ఆమె చేసిన పాత్ర చూసి చాలా మంది షాకయ్యారు. ఈ క్యారెక్టర్‌కు గాను ‘హలో’ హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డ్స్-సౌత్ 2023లో మంచు లక్ష్మీకి ‘బెస్ట్ వెర్సటైల్ యాక్టర్’గా అవార్డు దక్కింది. ఈ విషయాన్ని లక్ష్మీ మంచు.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
నా స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ అవార్డును అందుకోవడం చాలా గర్వంగా ఉంది. స్కూల్ డేస్ నుంచి నాకు బాగా తెలిసిన శాలు భూపాల్ నుంచి ఈ అవార్డు అందుకోవడం నాకు చాలా స్పెషల్. ఈ క్యారెక్టర్‌ను చేయడంలో నాకు సహకరించిన ‘మాన్‌స్టర్’ చిత్ర బృందానికి, మరీ ముఖ్యంగా మోహన్‌లాల్ సర్‌కు నా కృతజ్ఞతలు అని చెప్పింది. ఈ మూవీ మొత్తంలో హనీ రోజ్ ప్రధాన పాత్రలో కనిపిస్తుండగా.. మోహన్ లాల్ కిల్లర్ లక్కీ సింగ్‌గా, సీక్రెట్ పోలీస్‌గా కూడా కనిపించారు,టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వక ముందు మంచు లక్ష్మీ ఫారిన్‌లో యాక్టింగ్ కోర్స్ చేయడమే కాకుండా అక్కడే రెండు మూడు హాలీవుడ్ టెలివిజన్ సిరీస్‌లలో కూడా నటించింది. ఇక సిద్ధార్థ హీరోగా నటించిన ‘అనగనగా ఒక ధీరుడు’ చిత్రంలో నెగెటివ్ రోల్ పోషించడం ద్వారా టాలీవుడ్‌లో నటిగా అడుగుపెట్టింది. అంతేకాదు మొదటి సినిమాలోనే యాక్టింగ్‌తో మెప్పించి అవార్డ్ కూడా కొట్టేసింది.