Tuesday, November 26, 2024

మానవహారంతో – నిరసన

మోడీ సర్కార్‌ ముర్దాబాద్‌ అంటూ కరీంనగర్ జిల్లాలోని అలుగునూర్ చౌరస్తాలో మనవహారంతో కార్మిక సంఘాలు, వామపక్షాల, ప్రజాసంఘాలు నాయకులు కార్యకర్తల నినాదాలతో మిన్నంటింది. ప్రభుత్వ రంగాన్ని కార్పొరేట్లకు అమ్మటమా? సిగ్గు..సిగ్గు., పెరుగుతున్న నిత్వాసర ధరలను అదుపు చేయలేని ప్రభుత్వమా దిగిపో.. సేవ్‌ ఇండియా..సేవ్‌ పబ్లిక్‌ రంగం అంటూ దిక్కులు పిక్కటిల్లేలా స్లోగన్స్‌ మార్మోగాయి. ఏన్నో ఏండ్ల పోరాటాలతో సాధించుకున్న హక్కుల్ని హరిస్తే..సహించం, విద్యుత్‌ సంస్కరణలు ఉపసంహరించుకోవాలి,ఉపాధి హామీకి 25శాతం నిధులు తగ్గించడం దారుణం. పట్టణాలల్లో కూడా ఉపాధి పనులు ప్రారంభించాలని, జాబ్ కార్డు ఉన్నప్రతి వ్యక్తికి 200రోజులు పనులు కల్పించాలని, రోజుకు 600/-లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ. ఉద్యమం తప్పదంటూ హెచ్చరికలతో కూడిన ప్ల కార్డులను నాయకులు, కార్యకర్తలు ప్రదర్శించారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా వామపక్షాల ఆధ్వర్యంలో రెండవ రోజు మానవహారం, అరెస్టులు చేశారు.వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శిలు బండారి శేఖర్, వడ్లరాజు, ఉపాధ్యక్షులు రాయికంటి శ్రీనివాస్, సహాయ కార్యదర్శి కవ్వంపల్లి అజయ్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement