టీఎంఎఫ్, ఎస్‌ఎంఎఫ్‌లను సమర్థవంతంగా వినియోగించుకుని స్కూళ్ల నిర్వహణను పటిష్టం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివరించారు. విద్యాశాఖ పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా జగన్ మాట్లాడుతూ… ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలో నాడు-నేడు కింద చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల రెండో విడత పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు సబ్జెక్టులు మరింత నిశితంగా అర్థం అయ్యేలా బోధించేందుకు ప్రతి తరగతిలో ఇంటరాక్టివ్ డిస్‌ప్లేలు లేదా ప్రొజెక్టర్లు పెట్టాలని, వీటి భద్రతకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. స్మార్ట్ బోధన సదుపాయాల వల్ల పిల్లలకూ, ఉపాధ్యాయులకూ మేలు జరుగుతుందని తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement