Friday, November 22, 2024

అమ్మో గుండె పోటు.. 20కి పైగా రెస్టారెంట్ల‌లో బిల్లు ఎగ్గొట్టిన కేటుగాడు!

స్పెయిన్‌లోని బ్లాంకా అనే ప్రాంతంలోని ఓ వ్య‌క్తి మ‌స్తు ప్లాన్ వేశాడు. ఫ్యాన్సీ రెస్టారెంట్లలో బోజ‌నం చేసి.. ఆపై బిల్లు చెల్లించకుండా ఉండేందుకు గుండెపోటు వచ్చినట్లు ప‌డిపోయేవాడు. ఈ విధంగా అత‌ను ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు 20కి పైగా రెస్టారెంట్లలో బిల్లును ఎగ్గొట్టాడు.

అయితే గత నెలలో కూడా ఇదే ప్లాన్ ని ఫాలో అవుతూ ఓ ఫ్యాన్సీ రెస్టారెంట్ లో బోజ‌నం చేశాడ‌త‌ను.. ఇక అంతా అయిపోన త‌రువాత హోటల్‌లో స్టాఫ్ బిల్లుని తెచ్చి ఇస్తుండ‌గా.. ప్లాన్ ప్ర‌కారం గుండేపోటు వ‌చ్చిన‌ట్టు న‌టించసాగాడు. అయితే ఈ సారి అత‌న పప్పులు ఉడ‌క‌లేదు.. అప్ప‌టికే అతని గురించి తెలుసుకున్న పోలీసులు ఆ వ్యక్తి ఫోటోల‌తో హెచ్చరికగా ప‌లు ప్రాంతంలోని రెస్టారెంట్లలో ప్రచారం చేశారు. దీంతో ఆ రెస్టారెంట్ సిబ్బంది ఆ వ్య‌క్తి గుర్తించి పోలీసుల‌కు అప్ప‌చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement