Friday, November 22, 2024

సోషల్ మీడియా ఎఫెక్ట్.. కరోనా సోకిందని కిరోసిన్ తాగిన వ్యక్తి

కరోనా రాకుండా ఉండాలంటే అవి చేయండి.. ఇవి చేయండి అంటూ సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు సలహాలు ఇస్తున్నారు. వీటిని పాటిస్తున్న కొందరు తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఓ వ్యక్తి సోషల్ మీడియాలో వచ్చిన ఓ పోస్టును గుడ్డిగా నమ్మాడు. చివరకు ప్రాణాలను కోల్పోయాడు

భోపాల్ శివ్‌నగర్ ప్రాంతానికి చెందిన మహేంద్ర (30) అనే వ్యక్తికి ఇటీవల జ్వరం వచ్చింది. కొన్ని మెడిసన్‌లు వాడినా తగ్గలేదు. దీంతో తనకు కరోనా వచ్చిందని భావించాడు. అయితే సోషల్ మీడియాలో ఓ వ్యక్తి కరోనా సోకితే కిరోసిన్ తాగాలని సూచించడంతో మహేంద్ర దానిని పాటించాడు. గత బుధవారం కిరోసిన్ తాగాడు. దీంతో తనకు కరోనా తగ్గిపోతుందని భావించాడు. కానీ అప్పటికే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా సోమవారం మహేంద్ర మరణించాడు. అయితే టెస్టుల్లో మహేంద్రకు నెగిటివ్ రావడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement