సరదాగా బర్త్ కేక్ కట్ చేయాల్సిన యువకులు..హద్దులు మీరుతున్నారు. వీపరీత బుద్దికి పోయి పెద్ద పెద్ద కత్తులతో కేక్ లు కట్ చేస్తున్నారు. మహారాష్ట్రలోని పూణేకు చెందిన రితేష్ పేకే, ఆదిత్య నలవాడే అనే ఇద్దరు యువకులు జనతా వాసహత్లో బర్త్‌డే కేక్‌ను కత్తితో కోశారు. కొడవలి మాదిరి పదునైన ఆయుధాలను చేతిలో పట్టుకుని హంగామా చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో పదునైన ఆయుధాలు కలిగి ఉన్నారన్న నేరంపై దత్తవాడి పోలీసులు శుక్రవారం రాత్రి ఆ ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. కత్తితోపాటు వారి వద్ద ఉన్న 7 ఇతర మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని తయారు చేసిన భోర్ ప్రాంతానికి చెందిన ప్రేమ్ పవార్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. ఆ ఇద్దరు యువకులు మరో నాలుగు ఆయుధాల కోసం ఆర్డర్ ఇచ్చినట్లు అతడు చెప్పాడు.
ఇది కూడా చదవండి: మరోసారి భయపెడుతున్న లారెన్స్.. ‘దుర్గ’ ఫస్ట్ లుక్ రిలీజ్