Tuesday, November 26, 2024

Molesting | విమానంలో బాలికతో అనుచిత ప్రవర్తన.. పోక్సో కేసు నమోదు, బెంగళూరులో అరెస్టు!

దోహా-బెంగళూరు విమానంలో 13 ఏళ్ల బాలికతో పక్క సీటులో కూర్చున్న వ్యక్తి అనుచితంగా ప్రవర్తించాడు. పదే పదే చేతులు వేయడం, వేధింపులకు పాల్పడడంతో ఆ 51 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. తన భార్య, కుమార్తెతో కలిసి దోహ నుంచి బెంగళూరు వెళ్తుండగా విమానంలో ఈ ఘటన జరిగింది. తమిళనాడులోని శివగంగ నగరానికి చెందిన అమ్మవసాయి మురుగేషన్ (51) అనే వ్యక్తి బాలికను అనుచితంగా తాకాడని వారు ఆరోపించారు.

మురుగేశన్ ఖతార్‌లోని దోహాలో ఒక ప్రైవేట్ సంస్థలో పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది.  విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఆ అమ్మాయి మురుగేషన్ పక్కనే కూర్చుంది. తనకు ఫుడ్​ కానీ, ఇంకేదైనా కావాలా అని నిందితుడు బాలికతో మాటలు కలిపాడు.  మొదట్లో, ఇది కేవలం సామాజిక పరస్పర చర్య అని తల్లి భావించింది. అయితే, మురుగేశన్ అమ్మాయితో అలాగే మాటలు కొనసాగించాడు. ఆమెను అనుచితంగా తాకడం ప్రారంభించాడు.

ఈ ఘటనను గమనించిన తల్లి తన భర్తకు చెప్పడంతో వెంటనే క్యాబిన్ సిబ్బందికి సమాచారం అందించారు. తదనంతరం, బెంగళూరు విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయిన తర్వాత సిబ్బంది మురుగేషన్‌ను అదుపులోకి తీసుకుని భద్రతా సిబ్బందికి అప్పగించారు. బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement