Saturday, November 23, 2024

ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం

ఉద్యోగాలు ఇప్పిస్తానని వందలాది మంది బాధితులకు టోకరా వేసిన వ్యక్తి వరంగల్ జిల్లా హన్మకొండ పోలీసులకు చిక్కాడు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ  ఘరానా మోసానికి పాల్పడిన నిందితుడు కానుంగటి నవీన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడకు చెందిన అశోక్ తో కలిసి ఈజీగా మనీ సంపాధించాలనే ఉద్దేశంతో నవీన్.. సీఐబీ అధికారిగా అవతతారం ఎత్తాడు. సీఐబీ ఆఫీసర్ నంటూ ఉద్యోగాల పేరుతో పలువురి దగ్గర లక్షల రుపాయలు వసూలు చేశాడు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే తీరుగా మోసాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో డోర్నకల్ లోనూ నవీన్ పై కేసులు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు.  తాను సీబీసీఐడీలో పనిచేస్తున్నానని నమ్మించి.. ఓ అమ్మాయిని 20 రోజుల కిందటే ప్రేమ వివాహం చేసుకున్నాడు.  నిందితుడి వద్ద నుంచి ఒక డమ్మీ గన్ను, నకిలీ ఐడీ కార్డులు, అపాయింట్ లెటర్లను స్వాధీనం చేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా గార్లకు చెందిన నవీన్…. ఓ ప్రజాప్రతినిధి కొడుకుగా తెలుస్తోంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement