టీమిండియా మాజీ కెప్టెన్..ప్రస్థుత బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ నిన్న తన 49వ పుట్టిన రోజును జరుపుకున్నారు. అయితే సౌరవ్ గంగూలీకి గురువారం తన పుట్టిన రోజు సందర్భంగా ఓ ఊహించని బహుమానం లభించింది. అప్పటి వరకూ సింపుల్‌గా ఇంట్లోనే తన బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకున్న దాదా దగ్గరికి సాయంత్రం 5 గంటల ప్రాంతంలో దీదీ వచ్చారు. గులాబీల బొకే, స్వీట్లతో తన ఇంటికి వచ్చిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీని దాదా సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించారు. అంతేకాదు ఆమె తిరిగి వెళ్లేటప్పుడు గంగూలీ కూడా ఓ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం విశేషం. ఇక మమతా అలా వెళ్లిపోయారో లేదో వెంటనే రాజ్‌భవన్ నుంచి కూడా బర్త్‌డే విషెస్ చెబుతూ దాదాకు ఓ బొకే వచ్చింది.
ఇది కూడా చదవండి: రేవంత్ రాకతో కేసీఆర్ వెన్నులో వణుకు