Tuesday, November 19, 2024

క‌రోనా మెడిసిన్ టాక్స్ మాఫీ చేయండి: మోదీకి దీదీ లేఖ

కొవిడ్‌-19పై పోరాటంలో వైద్య పరికరాలు, మందుల‌పై పన్నులు మాఫీ చేయాల్సిందిగా కోరుతూ ప‌శ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీకి లేఖ రాశారు. అదేవిధంగా ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలని, కరోనా వైరస్ పాజిటివ్ రోగుల చికిత్స కోసం పరికరాలు, మందులు, ఆక్సిజన్ సరఫరాను పెంచాలని మ‌మ‌తా బెన‌ర్జీ కోరారు.

ఆక్సిజ‌న్ కాన్స‌ట్రేట‌ర్స్‌, సిలిండ‌ర్లు, కంటైనర్లు, కొవిడ్ సంబంధిత డ్ర‌గ్స్‌ను ప్ర‌భుత్వానికి అందించేందుకు వ్య‌క్తిగ‌తంగానూ, సంస్థ‌లు కూడా ముందుకు వ‌స్తున్న‌ట్లు తెలిపారు. కావునా వీటిని ఎస్‌జీఎస్‌టీ, సీజీఎస్‌టీ, ఐజీఎస్‌టీ ప‌రిధిలోంచి తొల‌గించాల్సిందిగా ఆమె కోరారు. పైన తెలిపిన‌వ‌న్నీ కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తున్న నేప‌థ్యంలో రోగుల ప్రాణాల‌ను కాపాడే మందులు, ప‌రికరాల స‌ర‌ఫ‌రాకు అడ్డంకులు తొల‌గించాల్సిందిగా అభ్య‌ర్థిస్తున్న‌ట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement