Saturday, June 29, 2024

Mamata Banerjee | నీట్ గందరగోళంపై మోదీకి మమతా బెనర్జీ లేఖ

దేశ వ్యాప్తంగా గందరగోళం రేపిన నీట్‌ని రద్దు చేయాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. దేశంలోని రాష్ట్రాలు సొంతంగా పరీక్షలు నిర్వహించుకునే పాత విధానాన్ని పునరుద్ధరించాలని అన్నారు. పేపర్ లీక్, లంచాలు ఇవ్వడం వంటి ఘటనలు ఆశావహుల భవిష్యత్తును, విశ్వాసాన్ని దెబ్బతీయడమే కాకుండా దేశంలోని వైద్య విద్య నాణ్యతను దెబ్బతీస్తాయని మమతా బెనర్జీ అన్నారు.

దీంతో భారత్ లో వైద్య సదుపాయాలు, వైద్య చికిత్స నాణ్యతపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం లేకుండా భారతదేశంలో వైద్య కోర్సుల ప్రవేశాలపై పూర్తి నియంత్రణ సాధించేందుకే నీట్ తీసుకొచ్చారని… ఇది సరైన విధానం కాదన్నారు. ఇది జాతీయ సమైక్యతా స్ఫూర్తిని దెబ్బతీస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ప్రవేశ పరీక్షల విధానాన్ని పునరుద్ధరిస్తే దేశంలోని పరీక్షా విధానంలో గందరగోళం లేకుండా సాధారణ పరిస్థితులు నెలకొంటాయని అన్నారు. వైద్య విద్యార్థుల్లో కూడా ఆత్మవిశ్వాసం నింపవచ్చని ఆమె అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement