Monday, November 18, 2024

దీది పై దాడి జరగలేదు…ఫైనల్

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. తనపై కొంతమంది వ్యక్తులు దాడి చేశారని కుట్రపూరితంగానే తనపై దాడి జరిగిందని ఆమె పోలీసులకు, మీడియా ముందు కూడా మాట్లాడారు. మరోవైపు మమతా బెనర్జీ సానుభూతి కోసం డ్రామాలాడుతున్నారని బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. ఇక విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఘటన ఎలా జరిగిందన్నదానిపై ఆరా తీశారు. మరోవైపు ఎన్నికల సంఘం కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. ఈ మేర వివేక్ దూబే, అజయ్ నాయక్ ఘటన జరిగిన ప్రదేశం నందిగ్రామ్ కు వెళ్లి విషయం తెలుసుకున్నారు. సీసీ కెమెరాలను సైతం పరిశీలించారు. అనంతరం ఈసికి ఓ నివేదికను అందచేశారు.

మమతా బెనర్జీపై ఎవరూ దాడి చేయలేదని.. అది ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన మాత్రమేనని స్పష్టం చేశారు. ఆమెపై దాడి జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని తెలిపారు. ఆ సమయంలో మమతా బెనర్జీ వెంట పోలీసులు కూడా ఉన్నారని వెల్లడించారు. మొత్తానికి మమతపై ఎలాంటి దాడి జరగలేదని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement