ఒడిశాలోని బాలేశ్వర్లో మూడు రైళ్లు ఢీకొని జరిగిన ఘోర ప్రమాదంలో బాధిత కుటుంబాలను ఆదుకొనే విషయంలో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ రాష్ట్రానికి చెందిన మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అలాగే, అవయవాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సైతం ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు.
కోల్కతాలో ఆమె మీడియాతో మాట్లాడుతూ,. కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై ప్రస్తుతం మానసిక, శారీరక గాయాలతో బాధపడుతున్నవారికి నగదు సాయం అందిస్తామన్నారు.మంగళవారం భువనేశ్వర్, కటక్ వెళ్లి అక్కడ వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించనున్నట్టు చెప్పారు.
ప్రస్తుతం బెంగాల్కు చెందిన ప్రయాణికుల్లో 206 మంది గాయపడ్డారని.. ఒడిశాలోని వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారని మమత చెప్పారు. వీరిలో 33 మంది పరిస్థితి విషమంగా ఉండగా వారంతా కటక్ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నట్టు దీదీ తెలిపారు. కొందరు మంత్రులు, సీనియర్ ఉన్నతాధికారులు తనతో పాటు వస్తారని పేర్కొన్నారు. ఈ ఘటనలో బాధిత కుటుంబాలను బుధవారం కలిసి ఎక్స్గ్రేషియో చెక్కులతో పాటు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను సైతం మమత అందించనున్నారు. రైలు దుర్ఘటన అంశంలో ఎలాంటి రాజకీయాల జోలికి వెళ్లబోనన్న దీదీ.. క్షతగాత్రులు, వారి కుటుంబాలకు సాయం గురించే ఆలోచిస్తున్నట్టు చెప్పారు.
Hon'ble CM @MamataOfficial has prioritized a visit to Odisha tomorrow to meet injured Balasore tragedy victims.
— All India Trinamool Congress (@AITCofficial) June 5, 2023
GoWB Ministers @Chandrimaaitc & @DrShashiPanja will accompany her to ensure they can meet the large number of victims, who are being treated across different… pic.twitter.com/4bppcVYGGQ