లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ షాక్ ఇచ్చారు. కాంగ్రెస్‌తో పొత్తు లేకుండానే పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 42 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అలాగే, కోల్‌కతా నుంచి టీఎంసీకి ప్రచారం ప్రారంభించారు.
అయితే ఎనిమిది మంది సిటింగ్ ఎంపీలను పక్కన పెట్టేశారు. మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ బహరామ్‌పుర్ నుంచి పోటీ చేయనున్నారు. మహువా మెయిత్రా మళ్లీ కృష్ణానగర్ నుంచి పోటీ చేస్తారు. యూపీలో ఒక స్థానం నుంచి పోటీ చేయడానికి సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌తో టీఎంసీ చర్చలు జరుపుతోంది.