ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లి ఖార్జున్ ఖర్గే లేఖ రాశారు. తాజాగా రాహుల్ గాంధీ అమెరికాలో మాట్లాడిన మాటలు దేశద్రోహమని… కొందరు బీజేపీ నేతలు తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతున్నారని అన్నారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి.. రాహుల్ గాంధీని టెర్రరిస్టుతో పోల్చారు. లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న రాహల్ గాంధీపై ఇలాంటి అనాగరికంగా మాట్లాడటం మంచిది కాదని ప్రధాని మోదీకి రాసిన లేఖలో ఖర్గే పేర్కొన్నారు.
రైల్వే శాఖ సహాయ మంత్రితో పాటు యూపీకి చెందిన ఓ మంత్రి కూడా రాహుల్ ను టెర్రరిస్టుగా సంబోధించారన్నారు. ఇలా మాట్లాడే వారందరిపై క్రమశిక్షన చర్యలు తీలసుకోవాలని కోరారు. ఒకరు ఇందిరాగాంధీ లాగానే రాహల్ గాంధీకి కూడా మరణం వస్తుందని హెచ్చరించారని ఇలాంటివన్ని ఇతురుల్ని మోటివేట్ చేసేలా ఉంటాయన్నారు. ఇలాంటి మాటలు మాట్లాడేవారిపై ప్రధాని మోదీ తక్షణం ఆంక్షలు విధించాలని ఆశిస్తున్నానన్నారు. ఇలాంటి మాటలు మాట్లాడే నేతల్ని బీజేపీ నుంచి బహిష్కరించాలని కోరారు.